విశాఖ ఘటనపై స్పందించిన సిఎం జగన్‌

కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు ఫోన్..సహాయక కార్యక్రమాలు వేగవంతం చేయాలని ఆదేశం

AP CM Jagan
AP CM Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ విశాఖపట్టణంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో సంభవించిన గ్యాస్ లీక్ దుర్ఘటనపై స్పందించారు. జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పోలీస్ కమిషనర్‌ ఆర్‌కే మీనాతో ఫోన్‌లో మాట్లాడిన సిఎం జగన్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు సరైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు. కాగా, ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/