విశాఖ ఘటనపై స్పందించిన ప్రధాని మోడి
అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి విశాఖపట్నం ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమ గ్యాస్ లీకైన ఘటనపై స్పందించారు.’విశాఖపట్నంలోని పరిస్థితులపై హోం శాఖ, ఎన్‌ఎమ్‌డీఏ అధికారులతో మాట్లాడాను. అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాము. విశాఖపట్నంలో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను’ అని చెప్పారు.
మరోవైపు ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ… ‘విశాఖలోని ప్రైవేటు సంస్థలో గ్యాస్ లీక్ ఘటనలో చనిపోయిన ఐదుగురి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను. ఏపీ సీఎస్, డీజీపీలతో నేను మాట్లాడాను. అన్ని విధాలుగా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఎన్డీఆర్‌కు సూచించాను. అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాను. గ్యాస్ లీక్‌తో వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శితోనూ నేను మాట్లాడాను. అన్ని రకాలుగా సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరాను’ అని చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/