న్యూ ఇయర్ కేక్స్…

రుచి : వెరైటీ వంటకాలు

New year cakes making

కావసినవి: వెన్న-3 కప్పులు, చక్కెర -2 కప్పులు, గుడ్లు -4, వెనీలా ఎక్స్ట్రాక్ట్ -టేబుల్ స్పూన్, ఆల్మండ్ ఎక్స్ట్రాక్ట్ – ఆర టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ -2 టీ స్పూన్లు . ఉప్పు -చిటికెడు ,పాలు- కప్పు, బస్ట్ ప్యాన్ , మైదా -3 కప్పులు, కార్న్ స్టార్చ్ -6 టేబుల్ స్పూన్లు .

కేక్ పై గ్లేజ్ కోసం: చక్కర పొడి-రెండున్నర కప్పులు, పాలు – 5 టేబుల్ స్పూలు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – అర టీ స్పూన్, ఉప్పు – చిటికెడు .

ముందుగా అవెన్ను 350 డిగ్రీల మేరకు వేడి చేసుకోవాలి… ఒక వెడల్పాటి గిన్నెలో మైదా, కార్న్ స్టార్చ్ , బేకింగ్ పౌడరు , ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇపుడు మరొక గిన్నెలో వెన్న, చక్కర వేసి బాగా కలుపుకుని, గుడ్లు ఒక్కొక్కటిగా వేసి కలపాలి.. ఆపై, వెనీలా ఎక్స్ట్రాక్ట్, ఆల్మండ్ ఎక్స్ట్రాక్ట్ , మైదా మిశ్రమం , పాలు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కేక్ మిశ్రమాన్ని బస్ట్ ప్యాన్ లో వేసుకుని , గంట పాటు బేక్ చేసుకోవాలి… ఈ లోపు కేక్ పై గ్లేజ్ ను సిద్ధం చేసుకోవాలి. ఒక గిన్నె లో చక్కర పొడి, పాలు, వెనీలా ఎక్స్ట్రాక్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకుంటే , గ్లేజ్ సిద్ధం . ఇపుడు తయారు చేసుకున్న కేక్ ను బయటకు తీసి దానిపై ఈ గ్లేజ్ పోసుకుంటే వెనీలా బస్ట్ కేక్ సిద్ధం..