తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

సీఎం జగన్ కు వేదాశీర్వచనం అందించిన టీటీడీ అర్చకులు

new-year-celebrations-at-cm-jagan-camp-office-in-tadepalli

అమరావతిః తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర శోభ వెల్లివిరిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పెషల్ కేక్ కట్ చేశారు. అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్, ఇతర ఉన్నతాధికారులు సీఎం జగన్ ను కలిసి ఆయనకు విషెస్ తెలిపారు. ఈ క్రమంలో, తిరుమల నుంచి వచ్చిన టీటీడీ అర్చకులు సీఎం జగన్ కు వేదాశీర్వచనం అందించారు. స్వామివారి శేష వస్త్రం, ప్రసాదాలు, టీటీడీ క్యాలెండర్, డైరీలను సీఎం జగన్ కు అందించారు. కొత్త సంవత్సరాది నేపథ్యంలో, సీఎం కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర వైఎస్‌ఆర్‌సిపి నేతలు భారీగా తరలివస్తున్నారు.