1వ పాశురం: తిరుప్పావై

ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా:

Goda Devi-
Goda Devi-

మార్‌గత్తి త్తిజ్గళ్‌ మదినిఱైన్ద నన్నాళాల్‌
నీరాడప్పోదువేర్‌, పోదుమినోనేరిట్రైయీర్‌
శీర్‌మల్‌గుం ఆ§్‌ుప్పాడి శెల్వచ్చిఱుమీర్‌గాళ్‌
కూర్వేల్‌ కొడున్దొఱిలర్‌ నన్దగోపన్‌ కుమరన్‌
ఏరాన్దకణ్ణి, యశోదై యిళజ్గ్మమ్‌
కార్‌మేనిచ్చెజ్గణ్‌, కదిర్‌ మదియంపోల్‌ ముగత్తాన్‌
నారాయణనే,నమక్కేపఱై తరువాన్‌
పారోర్‌ పుగర్తి, ప్పడిన్దేలో రెమ్బావాయ్II
మార్గశిరమాసమిది, మంచి ముహుర్తమిది. శుక్లపక్షమి చంద్రుడుదయించే శుభముగాను, బల్లెమును చేబూని బహుజాగరూకుడై రక్షించునందుడు, నందగోపాలుని, అందాల కనులున్న అమ్మ యశోదకు, సింహము పిల్లంటి శ్రీకృష్ణుని, సూర్యచంద్రుల వంటి చూపున్న వాని నీలిమేఘము బోలు మేనున్న వాని, దేదీప్యమానమై వెలుగు మోము వాని, ”నమో నారాయణానీవే మా దిక్కంచు,
దీక్షతో సేవించి దీవెనలను పొంద సిరులొలుకు రేపల్లె శ్రీలక్ష్ములారా!
జ్ఞానమనెడు జలముతో స్నానమాడరండి లోకులందరు మెచ్చ, లోకములు మెచ్చ.
భావము: మార్గశిరమాసము. వెన్నెలతో నిండిన మంచిరోజు. మార్గశిరస్నానము చేయుగోరు అందమైన ఆభరణములు గల, ఐశ్వర్యము నిండిన వ్రేపల్లెలో నివసించు, సకల సంపదలుగల బాలికలారా, రండు ఎవరిని అర్థించని మనము నారాయణుని అర్థించి ‘పరయను సాధనమును పొందుదము. అదియే మన వ్రతము. ఈ వ్రతము శ్రద్ధతో చేయుదము. అందరు మనలను పొగడుదురు. మన ఇష్టదైవము కృష్ణుడు, నందగోపాలుడు, వేలాయుధముతో యశోదాదేవి బాలసింహము అయిన కృష్ణుడిని కాపాడు తున్నాడు. నల్లని శరీరముగల, సౌందర్యముతో నిండిన కన్నులు గల, సూర్యచంద్రుని ముఖము గల, ఎర్రని నేత్రములు గల, తాపమును పోగొట్టగల, మన ఇష్టదైవము అయిన కృష్ణుడిని ప్రార్థించి ‘పరయను సాధనమును అడుగుదాం రండు అని అండాళ్‌ తల్లి గోపికలను ఆహ్వానిస్తున్నది.
ఫలం: కాలం కలిసిరావటానికి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/