భారత్‌లో కొత్తగా 29,398 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,96,770..మొత్తం మృతుల సంఖ్య 1,42,186

corona cases- india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. గత 24 గంటల్లో 29,398 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,96,770కు చేరింది. ఇక గత 24 గంటల్లో 37,528 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 414 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,42,186 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 92,90,834 మంది కోలుకున్నారు. 3,63,749 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/