పట్టుదలతో ప్రార్థన
అంతర్వాణి: బైబిల్ కథలు

‘పరలోకమందున్న విూ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను (లూకా 11:13).
‘మనలో కార్యసాధనకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటి కంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగు నుగాక.
ఆమేన్ (ఎఫె 3:20). పైరెండు వాక్యాలు మనం దేవుడిపై ఆధారపడి, ఆయనకు విన్నవిస్తే తప్పనిసరిగా సాయం చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. అవ్ఞను దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనలను ఆలకిస్తాడు.
ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు.
ఆ స్నేహితుడు ప్రయాణం చేస్తూ అర్థరాత్రివేళ ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి తినేందుకు ఏమీ అతనివద్ద లేదు. దాంతో మరొక స్నేహితుడి వద్దకు వెళ్లి మూడురొట్టెలు బదులు ఇవ్వమని అడిగాడు. అయితే రాత్రిసమయం కావడంతో తనను డిస్టర్బ్ చేయవద్దని కోరాడు.
అయితే ఆ స్నేహితుడు పట్టుదలతో మాటిమాటికీ అడుగుతూ వ్ఞండడం వల్ల లేదనకుండా కావా ల్సింది ఇస్తాడు. అలాగే దేవ్ఞడిని కూడా ఈ విధంగా అడిగితే తప్పనిసరిగా ఇస్తానని యేసుప్రభువే ఈ మాటల్ని చెప్పాడు.
కాబట్టి మనం దేవ్ఞడిని మనస్ఫూర్తిగా వేడుకోవడం అలవర్చుకోవాలి. చాలామందికి ఉన్న ఒక అలవాటు ఏమిటం టే తమకు ఏదైనా అవసరం అయితే వేడుకుంటారు. దానికి సమాధానం రాకపోతే దేవుడికి ఇవ్వడం ఇష్టం లేదేమోనని అడగడం మానేస్తారు.
తూరుసీ దోను నుంచి వచ్చిన కనాను నుంచి ఒక మహిళ తన కుమార్తెకు దెయ్యం పడితే యేసుప్రభువు వద్దకు వచ్చి, ఆయన సాయం చేసేంతవరకు అడుగుతూనే ఉండిపోయింది. తద్వారా ప్రభువు ఆమె కుమార్తెకు పట్టిన దెయ్యం నుంచి విడుదల చేసాడు.
అవ్ఞను తలుపులు తీసేంతవరకు మనం కొడుతూనే వ్ఞండాలి. లోపల నుంచి సమాధానం వచ్చి, తలుపు లు తీసి, మనకు సాయం చేసేంతవరకు దేవుడిని ప్రార్థిస్తూనే ఉండాలి.
అంతేకాదు పట్టు దలతో ప్రార్థన చేయాలి. మనం విశ్వాసంతో మనకు కావాల్సింది పొందేంత వరకు వేడు కుంటూనే ఉండాలి. నిరాశ చెందవద్దు. ఆశతో, పట్టుదల తో ముందుకు సాగిపోవడం మంచిది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/