శక్తినిచ్చే గ్రీన్‌ఫుడ్‌

ఆహారం – పోషకాలు

Energizing green food
Energizing green food

గ్రీన్‌ ఫుడ్‌ అనేది మనం రోజువారి ఆహారంలో ఏం తిన్నా, తినకపోయినా గ్రీన్‌ కలర్‌
ఫుడ్‌ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం రోజూ కూరగాయలు, ఆకు
కూరలే తినాల్సిన అవసరం లేదు.

గ్రీన్‌ఫుడ్‌లో చాలా రకాలు న్నాయి. వాటిని తినడం అలవాటు చేసుకుంటే ఎన్నో రకాల రోగాలకు చెక్‌ పెట్టవచ్చు. తాజా ఆహారం ద్వారా లభించే పోషకాలు మనకు అత్యంత ఎనర్జీని ఇస్తాయి.

బాడీలోని ప్రతి కణాన్ని రిపేర్‌ చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. గ్రీన్‌ ఫుడ్స్‌లో యాంటీఆక్సిండెట్స్‌ చాలా బలంగాఉంటాయి . అవి వాతావరనంలో విష వ్యర్ధాల్ని బాడీలోకి రాకుండా చేస్తాయి.

Energizing green food

బాడీలో వ్యర్ధాలు ఉంటే తరిమేస్తాయి. గ్రీన్‌ఫుడ్స్‌లో ఉండే పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. వైరస్‌లు, బ్యాక్టీరియాలకు చెక్‌ పెడతాయి.

ఈ ఆహారంలో ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపేస్తాయి. ఎంత గ్రీన్‌గా ఉంటే అంత మంచిది. బాడీ మెటబాలిజంను సరిచేసే శక్తి గ్రీన్‌ఫుడ్స్‌కి ఉంటుంది. ఇందులో ఉండే క్లోరోఫిల్‌ రక్త కణాల్ని అభివృద్ధి చేస్తుంది.

ఆక్సిజన్ ను పెంచుతుంది. విష వ్యర్ధాల్ని తరిమేస్తుంది. రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. ఒక కప్పు బచ్చలి కూరలో రోజువారి కావాల్సిన విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. ఫైబర్‌, ప్రొటీన్స్‌ కూడా ఉంటాయి. ఇవి మన జీర్ణప్రసరణ వ్యవస్థను రక్షిస్తాయి. వేడిని తగ్గిస్తాయి. బిపి కంట్రోల్‌ చేస్తాయి. ఎముకల్ని దృఢంగా చేస్తాయి.

Energizing green food

కంటిక మేలు చేస్తాయి.వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇక గ్రీన్‌ యాపిల్స్‌ చాలా రుచిగా, కరకరలాడుతూ ఎక్కువ జ్యూస్‌తో ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్‌, పొటాషియం ఎక్కువ. అలాగే ఎసిబిఇ విటమిన్లు ఉంటాయి.

చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. గ్రీన్‌ యాపిల్‌ తొక్కతో సహా తింటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. బరువు తగ్గా లంటే ఇవి తినాలి. బిపి కంట్రోల్‌ ఉంటుంది. దంతాలు మెరుగవుతాయి.

జీర్ణక్రియ కూడా బాగుంటుంది. కీరదోసలో నీరు ఎక్కువ. ఎండాకాలంలో వీటిని ఎక్కువగా తినాలి. వీటిలో విటమిన్‌ ఎసి, ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి.

డీహైడ్రేషన్‌ అవకుండా ఇది కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్‌ సి వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది.

రోజు ఉదయం వేళ ఏదైనా జ్యూస్‌ తీసుకుం టుంటే అందులోకీరదోస కాయ ముక్కలు కూడా జత చేసుకోవచ్చు. లేదంటే ఉప్పు, కారం చల్లుకుని తినవచ్చు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/