దేశంలో కొత్తగా 2,503 కొరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 2,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 675 రోజుల్లో ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో 4,377 మంది కరోనా నుంచి కోలుకోగా… 27 మంది మృతి చెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.47 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4.29 కోట్ల మందికి కరోనా సోకింది. వీరిలో 4.24 కోట్ల మంది రికవర్ అయ్యారు. ఇప్పటి వరకు 5,15,877 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకు 1,79,91,57,486 డోసుల వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం దేశంలో 36,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/