ఉద్యోగుల సౌకర్యాలపై ‘మెటా’ కీలక నిర్ణయం

జుకర్ బెర్గ్ తీసుకున్న నిర్ణయంపై ఒకింత తీవ్ర విమర్శలు

'Meta' decision on employee facilities
‘Meta’ decision on employee facilities

సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు అందిస్తున్న ప్రోత్సాహకాల విషయంలో అధినేత మార్క్‌ జుకర్‌ బెర్గ్‌ తాజా నిర్ణయం గురించి ప్రఖ్యాత వార్త పత్రిక కధనాన్ని ప్రచురించింది.
అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రాంతం సిలికాన్ వ్యాలీలో ప్రముఖ టెక్‌ కంపెనీలు తమ ఉద్యోగుల నుంచి అత్యుత్తమ ఫలితాలను రాబట్టేందుకు అధిక ప్రోత్సాహకాలను అందిస్తుంటాయి.

ఇదిలావుండగా, కరోనా వేవ్ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా మెటా కంపెనీ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ధరించే దుస్తులను ఉతకటం, వాటిని ఇస్త్రీ చేయటం లాంటి సౌకర్యాలను ఇకపై ఉండదని ప్రకటించింది. కాగా, ఇతర ప్రోత్సాహకాలైన డిన్నర్ వేళల్లో మార్పులు, వ్యాలెట్‌ సేవలను కట్ చేయటం వంటి తాజా నిర్ణయాలను తీసుకుందని కూడా ఆ వార్తా సంస్థ పేర్కొంది.

ఫేస్‌బుక్‌ సంస్థ పేరును మెటాగా మార్చడం వల్ల కంపెనీ క్యాపిటలైజేషన్ పతనమైందనే కారణాలతో జుకర్ బెర్గ్ తీసుకున్న నిర్ణయంపై ఒకింత తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రోత్సాహకాలను తగ్గించటానికి, కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ వ్యాల్యూ పడిపోవడానికి ఎలాంటి సంబంధం లేదని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. కాగా, ఉద్యోగుల ఆరోగ్యం, ఇతర సెక్యూరిటీల విషయంలో అందించే నిధులను 300 డాలర్ల నుంచి 3000 డాలర్లకు పెంచినట్లు వారు చెబుతున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం :https://www.vaartha.com/andhra-pradesh/