తెలంగాణలో కొత్తగా 247 మందికి కరోనా

యాక్టివ్ కేసుల సంఖ్య 2,101

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 247 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 29 మంది కరోనా బారినపడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో 158 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తెలంగాణలో తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,769కి పెరిగింది. వారిలో 2,98,009 మంది కోలుకున్నారు. ఇంకా 2,101 మందికి చికిత్స జరుగుతోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/