నేడు దిశ కమిషన్ విచారణకు హాజరుకానున్న సజ్జనార్

హైదరాబాద్ : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈరోజు దిశ కమిషన్ విచారణకు హాజరుకానున్నారు. దిశ ఎన్ కౌంటర్ కేసులో అప్పుడు సజ్జనార్ సైబరాబాద్ సీపీగా ఉన్నారు. దిశ విచారణకు హాజరు కావాలని జ్యుడీషియల్ కమిషన్ సమన్లు జారీ చేసింది. నలుగురు నిందితుల ఎన్ కౌంటర్‌పై సజ్జనార్ స్టేట్‌మెంట్‌ను కమిషన్ నమోదు చేయనుంది. ఇప్పటికే ఎన్ కౌంటర్ బాధిత కుటుంబాలను, పలువురు సాక్ష్యుల వాగ్మూలాలను కమిషన్ నమోదు చేసింది. కాగా ఇవాళ సజ్జనార్ విచారణ కీలకంగా మారనుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/