తెలంగాణ‌లో కొత్త‌గా 216 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,933.. మొత్తం మృతుల సంఖ్య 1,652

హైదరాబాద్: తెలంగాణలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగిపోతున్నాయి. కొత్త‌గా 216 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 168 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,933కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,363 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,652గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,918 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 749 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.

తెలంగాణ‌లో కొత్త‌గా 216 కరోనా కేసులు

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/