ఇట‌లీలో మళ్లీ క‌ఠిన ఆంక్ష‌లు

రోమ్: క‌రోనా వైర‌స్ ఇట‌లీలో మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా వైర‌స్ కేసులు అధికం అవుతున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేయ‌నున్నారు. షాపులు, రెస్టారెంట్లు, స్కూళ్ల‌ను సోమ‌వారం మూసివేయ‌నున్నారు. ఏప్రిల్‌లో జ‌రిగే ఈస్ట‌ర్ వేడుక వ‌ర‌కు ష‌ట్‌డౌన్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేసేందుకు ఇట‌లీ ప్ర‌భుత్వం సిద్ద‌మైంది. గ‌త ఏడాది ఆరంభంలో క‌ఠిన‌మైన లాక్‌డౌన్ పాటించిన ఇట‌లీ.. మ‌ళ్లీ వైర‌స్ కేసుల‌ను అదుపు చేసేందుకు ఇబ్బందిప‌డుతోంది. ఇప్ప‌టికే ఆ దేశంలో కోవిడ్ వ‌ల్ల ల‌క్ష మందికిపైగా మృతిచెందారు. బ్రిట‌న్ త‌ర్వాత యూరోప్‌లో అత్య‌ధిక స్థాయిలో కేసులు న‌మోదు అయిన దేశాల్లో ఇట‌లీ రెండ‌వ స్థానంలో ఉన్న‌ది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/