అమెరికాలో మూడువేలు దాటిన కరోనా మరణాలు

నిన్న ఒక్కరోజే 540 మంది మరణం

america
america

అమెరికా: అగ్రరాజ్యంలో కరోనా కేసులు అదుపులోకి రావడంలేదు. కరోనా మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే అక్కడ కరోనా వల్ల 540 మంది మరణించారు. దీంతో కరోనా మరణాలు మూడు వేలు దాటాయి. కరోనా కేసుల సంఖ్య కూడా 1,63 లక్షలకు చేరింది. న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాలలో పరిస్థితి మరి భయానకంగా ఉంది. ఇక్కడ చికిత్సకు ఆసుపత్రుల్లో చోటు లేకపోవడంతో ఓ భారి నౌకను ఆసుపత్రిగా మార్చారు. కాగా ఇతర దేశాలలో ఉన్న అమెరికన్లను తమ సొంత దేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే 50 దేశాల్లో ఉన్న సుమారు 25 వేల మంది అమెరికన్లను సొంత దేశానికి చేర్చినట్టు అధికారులు పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/

dd New Post