ఏప్రిల్‌ నుంచి మరో 12 రైళ్లు

న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్‌తో రైళ్లు నిలిచిపోగా.. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సర్వీసులను రైల్వే అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మరో 12 రైళ్లను పునరుద్ధరించనుంది. ఇందులో రోజువారి ఎక్స్‌ప్రెస్‌, వారాంతపు సర్వీసులు ఉన్నాయి. విజయవాడ, సాయినగర్‌-విజయవాడ (07207-07208), విజయవాడ – సికింద్రాబాద్‌ – విజయవాడ (02799-02800), విశాఖపట్నం – సికింద్రాబాద్‌- విశాఖపట్నం (02739-02740), గుంటూరు-విశాఖపట్నం-గుంటూరు (07239-07240), గూడూర్‌- విజయవాడ-గూడూర్‌ (02734-02644) నర్సాపూర్ – ధర్మవరం – నర్సాపూర్ (07247-07248) సర్వీసులను ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. వీటిని రైల్వే ప్రత్యేక రైళ్లుగా నడుపుతోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/