బ్రెజిల్‌లో 24 గంటల్లో 21,432 కొత్త కేసులు

మొత్తం 51,271 మంది మృతి

corona positive case
corona positive case

జనీరో: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. ఈనేపథ్యలోనే బ్రెబిల్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 21,432 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఒక్కరోజే కరోనా బారినపడి 654 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 11,11,348కు చేరింది. ఇవాళ్టి వరకు బ్రెజిల్‌లో 51,271 మంది మహమ్మారి కారణంగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న దేశాల్లో అమెరికా(23,88,225 కేసులు) మొదటి స్థానంలో ఉండగా.. బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/