నూటికి నూరు శాతం ఇళ్లపట్టాలు పంపిణీ కావాలి

అధికారులకు సిఎం జగన్‌ హెచ్చరికలు..

jagan mohan reddy
cm jagan mohan reddy

అమరావతి: ఏపి సిఎం జగన్‌ మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ‘స్పందన’ కార్యక్రమంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జూలై 8న దివంగత సిఎం వైఎస్ఆర్ జయంతి రోజున పేదలకు ఇళ్ల పట్టాలని నిర్ణయించారు. 29-30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని.. ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం అని జగన్‌ అన్నారు. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి మీద నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను సూచించారు. నూటికి నూరు శాతం ఇళ్లపట్టాలు పంపిణీ కావాలని జగన్ స్పష్టం చేశారు. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలని అన్నారు. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో పెట్టాలని ఆదేశించారు. వైఎస్‌ఆర్‌సిపికి ఓటు వేయని వారికి కూడా ఇండ్ల పట్టాలు అందించాగలని జగన్‌ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాల వారిగా ఇండ్ల పట్టాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/