వచ్చే నెల భారత్‌కు రానున్న శ్రీలంక ప్రధాని

Sri Lankan PM Mahinda Rajapaksa
Sri Lankan PM Mahinda Rajapaksa

కొలంబో: శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే వచ్చే నెల ప్రారంభంలో భారత్‌లో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశాలున్నా యని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటితో పాటు ప్రాంతీయ భద్రత, కొలంబోలోని ఈస్ట్‌ కంటైనర్‌ టెర్మినల్‌, ట్రింకోమలీ ఆయిల్‌ ట్యాంక్‌ ఫార్మ్స్‌ పలు అంశాలపై చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే భారత్‌ను సందర్శించిన రెండు నెలల అనంతరం ఈ పర్యటన ఖరారు అయింది. గత వారం లంక విదేశీ సంబంధాల మంత్రి దినేష్‌ గుణవర్ధనే..విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ను ఢిల్లీలో కలిసిన సంగతి తెలిసిందే.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/