అత్యంత బాధ్యతా రహితమైన అధ్యక్షుడు ట్రంప్

ఎవరూ ఊహించని రీతిలో బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు…బైడెన్‌

Biden Says Trump Is Showing ‘Incredible Irresponsibility’

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్‌ అధికార బదలాంపును అలస్యం చేస్తూ … నమ్మశక్యం కాని బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నారని అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న జో బైడెన్ విమర్శించారు. ట్రంప్ తీరు వల్ల ప్రజాస్వామ్యం గురించి ఇతర ప్రాంతాలకు ప్రతికూల సందేశం వెళుతుందని ఆయన చెప్పారు. ట్రంప్‌ ప్రదర్శిస్తోన్న ప్రతి చర్యను వారు గుర్తుంచుకునేలా చేస్తుందని అన్నారు. తమ దేశ చరిత్రలోనే అత్యంత బాధ్యతా రహితమైన అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారని ఆయన చెప్పారు.

ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందంటూ వచ్చిన ఆరోపణలను జో బైడెన్‌ ఖండిస్తూ… ఈ ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకోలేకే రిపబ్లికన్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. ట్రంప్ ఎలా ఆలోచిస్తాడన్న విషయాన్ని చెప్పడం కష్టమని బైడెన్ చెప్పుకొచ్చారు. తాను వచ్చే ఏడాది 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని చెప్పారు. ట్రంప్ వల్ల అధికార మార్పిడిలో జాప్యం జరుగుతుండడంతో కరోనాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడం కష్టతరంగా మారుతుందని తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/