దేశంలో కొత్తగా 2124 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 1,675 మందికి పాజిటివ్‌రాగా, తాజాగా ఆ సంఖ్య 2124కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,42,192కు చేరాయి. ఇందులో 4,26,02,714 మంది కోలుకోగా, 14,971 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో 5,24,507 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 1977 మంది కరోనా నుంచి బయటపడగా, 17 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇక మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. అదేవిధంగా 98.75 శాతం మంది బాధితులు డిశ్చార్టీ అయ్యారని, 1.22 శాతం మరణించారని పేర్కొన్నది. ఇక రోజువారీ పాజిటివిటీ 0.46 శాతంగా ఉందని వెల్లడించింది. మంగళవారం 13,27,544 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని, దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన కరోనా టీకా డోసుల సంఖ్య

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/