కుప్పకూలిన ఆర్మీ హెలికాప్ట‌ర్‌.. ఇద్ద‌రు పైలట్లు మిస్సింగ్‌

2 Pilots Missing After Army’s Cheetah Helicopter Crashes In Arunachal

గౌహ‌తి: భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని మండ‌లా ప్రాంతంలో కూలింది. దాంట్లో ఉన్న ఇద్ద‌రు సిబ్బంది క‌నిపించ‌కుండాపోయారు. లెఫ్టినెంట్ క‌ల్న‌ల్‌తో పాటు ఓ మేజ‌ర్ కూడా మిస్సైన‌ట్లు భావిస్తున్నారు. ఈరోజు ఉద‌యం 9.15 నిమిషాల‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్‌తో ఆ హెలికాప్ట‌ర్‌కు సంబంధాలు తెగిపోయిన‌ట్లు ఆర్మీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని బోమిడిలా వ‌ద్ద ఆప‌రేష‌న‌ల్ సోర్టీ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో చీతా హెలికాప్ట‌ర్‌తో కాంటాక్ట్ తెగిపోయిన‌ట్లు ఆర్మీ అధికారులు వెల్ల‌డించారు.