దసరా లో ఆ సీన్ నానిని నిద్ర పట్టకుండా చేసిందట..

నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్నమాస్ ఎంటర్టైనర్ ‘దసరా’. నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మార్చి 30 న పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి సారించారు మేకర్స్. ఇప్పటికే సినిమాలోని పలు సాంగ్స్ రిలీజ్ చేసి ఆకట్టుకోగా..తాజాగా చిత్ర ట్రైలర్ ను మంగళవారం విడుదల చేసారు. ట్రైలర్ అంత కూడా ఊర మాస్ గా ఉంది. ఇప్పటివరకు కూల్ గా కనిపించి లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న నాని..ఫస్ట్ టైం దసరా లో ఊర మాస్ లుక్ లో కనిపించి అదరగొట్టాడు. ప్రస్తుతం సోషల్ ఇండియా లో ట్రైలర్ తెగ చక్కర్లు కొడుతుంది.

ఇదిలా ఉంటె ఈ మూవీ ప్రమోషన్లో పాల్గొన్న నాని..చిత్ర షూటింగ్ లో తాను ఎదురుకున్న కష్టమైనా సీన్ గురించి చెప్పుకొచ్చారు. “డంపర్ ట్రక్ కోల్స్ ను తీసుకుని వెళ్లి డంప్ చేస్తుంటుంది. ఆ డంపర్ ట్రక్ లో నుంచి నేను కిందపడితే ఆ బొగ్గు నాపై పడాలి. సింథటిక్ బొగ్గు రెడీ చేశారు .. డస్ట్ తోనే అవి ఉంటాయి. ఆ డంపర్ లో నుంచి నేను క్రింద పడిపోయాను. సింథటిక్ కోల్స్ క్రింద నుంచి నన్ను పైకి లాగడానికి కొంత సమయం పడుతుంది. ఆ గ్యాప్ లో నేను గాలి పీల్చకుండా ఉండలేను .. పీల్చితే డస్ట్ అంతా లోపలికి వెళ్లిపోతుంది.

ఈ సీన్ షూటింగ్ అయ్యాక చాలా రోజుల పాటు.. డంప్ లో నుంచి బొగ్గుతో పాటు నేను పడటం .. బొగ్గు నాపై పడటం .. నన్ను పైకి లాగడం .. ఇవన్నీ నాకు పదే పదే గుర్తుకొచ్చేవి. లోపల ఏదో ఇబ్బందిగా అనిపించేది. అది క్లియర్ కావడానికి చాలా సమయం పట్టింది. ఆ కారణం వలన రెండు నెలల పాటు నిద్రపట్టలేదు” అని చెప్పుకొచ్చారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రల్లో నటించారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ‘దసరా’ విడుదలకానుంది.