వచ్చే నెల 3న ఏపి కేబినెట్ భేటి

అమరావతి: సిఎం జగన్ అధ్యక్షతన ఏపి కేబినెట్ మరోసారి భేటి కానుంది. సెప్టెంబర్ 3, ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. ఈసమావేశంలో రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కాగా, ఆగస్టు 19 న జరిగిన సమావేశంలో ‘వైఎస్సార్ ఆసరా’, ‘జగనన్న విద్యా కానుక’, ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ,’ వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్’ పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/