బ్రిటీష్.. బిజెపి సేమ్ టూ సేమ్ అంటూ పోస్టర్లు

బిజెపి తీరుకు వ్యతిరేకంగా గత కొద్దీ నెలలుగా పోస్టర్లు వెలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను విచారించడం ఫై బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా ‘బీజేపీలో చేరితే మరకలు పోతాయి’ అని అర్థం వచ్చేట్టుగా హోర్డింగులను పెట్టిన సంగతి తెల్సిందే. హోర్డింగ్ పై భాగంలో వాషింగ్ పౌడర్ నిర్మా అని.. కింది భాగంలో ‘వెల్‌కమ్‌ టు అమిత్‌ షా’ అని రాశారు. నిర్మా యాడ్ లో ఉండే అమ్మాయి ఫొటోలో ముఖాన్ని మార్చారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరిన హిమంత బిశ్వ శర్మ, నారాయణ్ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి ఈశ్వరప్ప, జ్యోతిరాదిత్య సింధియా, విరూపాక్షప్ప, అరుణ్ ఖోట్కర్ మొఖాలను పెట్టారు.

తాజాగా బ్రిటిష్ వారు స్వాంతంత్య్ర సమరయోధుల నోర్లు మూయించినట్లుగా బిజెపి ప్రభుత్వం కేసీఆర్, కవితతో పాటు మరికొందరు నాయకుల నోర్లు మూయిస్తోందనేలా కొన్ని వాల్ పోస్టర్లు వెలిసారు. మహాత్మా గాంధీ, చంద్రబోస్, భగత్ సింగ్ నాయకుల నోర్లు మూసిన ఫోటోలు పై వరుసలో… కేసీఆర్, కవిత, కేజ్రీవాల్, నితీశ్, స్టాలిన్ ల నోరు మూసినట్లుగా కింది వరుసలో ఫోటోలతో గోడలకు పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. కవిత ఈడి విచారణ వేళ ఈ పోస్టర్లు వెలియడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.