కుప్పకూలిన మిగ్‌ ఫైటర్‌జెట్.. ఇద్దరు మృతి

2-dead-after-mig-21-fighter-jet-crashes-in-rajasthan-pilot-safe

న్యూఢిల్లీః భారత వాయుదళానికి చెందిన మరో మిగ్-21 యుద్ధ విమానం సోమవారం రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ చివరి నిమిషంలో విమానం నుంచి ఎజెక్ట్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సూరత్‌గఢ్ నుంచి ఈ విమానం బయలుదేరింది. ఈ ఘటనలో స్థానికులు ఇద్దరు దుర్మరణం చెందారు. ఇక సహాయక చర్యలు చేపట్టేందుకు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హెలికాఫ్టర్‌లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా, ఈ ఏడాది జనవరిలో రెండు వేర్వేరు ఘటనలో సుఖోయ్ సు-30, మిరాజ్-2000 యుద్ధవిమానాలు అకస్మాత్తుగా కూలిపోయాయి. ఈ క్రమంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. గత వారం ఆర్మీకి చెందిన ఓ హెలికాఫ్టర్ జమ్ముకశ్మీర్‌‌లోని కిష్ట్వార్ జిల్లాలో క్రాష్ అయిన విషయం తెలిసిందే.