టెక్సాస్ లో మరో ప్రమాదం .. ఏడుగురి మృతి

బస్టాండ్ లో వెయిట్ చేస్తున్న వారిని కారు వేగంగా ఢీ కొట్టిన వైనం

SUV driver hits crowd at Texas bus stop near border; 7 dead

టెక్సాస్ : అమెరికాలోని టెక్సాస్ లో మరో ప్రమాదం సంభవించింది. అలెన్ పట్టణంలోని మాల్ లో కాల్పుల ఘటనలో ఎనిమిది మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాల్పుల ఘటన జరిగిన మరుసటి రోజే కారు ప్రమాదం జరిగింది. బ్రౌన్స్ విల్లేలోని ఓ బస్ స్టాండ్ లో వేచి ఉన్న వారిపైకి కారు దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో పదిమంది గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం బ్రౌన్స్ విల్లేలోని ఓ వలసదారుల సహాయక కేంద్రం దగ్గర్లో ఉన్న బస్ స్టాప్ లో ఈ దారుణం జరిగింది.

ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారు చెప్పిన వివరాల ప్రకారం.. బస్ స్టాపులో చాలామంది బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడి ప్లాట్ ఫారంపై కొంతమంది కూర్చుని ఉండగా, ఇంకొందరు నిల్చున్నారు. ఇంతలో ఓ కారు వేగంగా దూసుకు రావడం గమనించారు. ప్రమాదం గుర్తించి తప్పుకునేందుకు ప్రయత్నించేలోగా కారు తమను ఢీ కొట్టిందన్నారు. అంతా క్షణాల్లో జరిగిపోయిందని వివరించారు.