కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం ..ముగ్గురి మృతి

కర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగర సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై బుధవారం వేగంగా వెళ్తున్న కారు లారీని ఢీకొంది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని సోమశేఖర్​, గణేష్​, రుద్రగా గుర్తించారు.

పోలీసుల తెలిపిన ప్రకారం..రాయదుర్గానికి చెందిన గణేశ్, రుద్ర, సోమశేఖర్.. కర్నూలుకు చెందిన గోపి, రాజు, జాఫర్ అనంతపురంకు బయల్దేరారు. అయితే ఔటర్ రింగ్ రోడ్డుపై వీరు వెళ్తున్న వాహనం ముందుగా వెళ్తున్న లారీని ఢీకొంది. దీంతో రుద్ర, సోమశేఖర్, గణేశ్ స్పాట్‌లో చనిపోయారు. ఈ క్రమంలో గోపి, జాఫర్, రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారును ఢీ కొన్న లారీ కోసం దర్యాప్తు చేస్తున్నామని సీఐ శేషయ్య తెలిపారు.