దేశంలో కొత్తగా 1,549 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 25,106

corona virus-india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 1,549 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,652 మంది కరోనా నుంచి కోలుకోగా… 31 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 25,106 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.74గా ఉంది. క్రియాశీల రేటు 0.06 శాతానికి దిగొచ్చింది. ఇప్పటి వరకు 1,81,24,97,303 డోసుల వ్యాక్సిన్ వేశారు. నిన్న మరో 2.97 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పుడు 12 నుంచి 14 ఏళ్ల వారికి కూడా టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/