దేశంలో కొత్తగా 14,830 కరోనా కేసులు

corona virus – india

న్యూఢిల్లీః దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 14,830 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మహమ్మారి నుంచి 18,159 మంది కోలుకున్నారు. మరో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,39,20,451కు చేరింది. ఇప్పటి వరకు 4,32,46,829 మంది బాధితులు కోలుకోగా.. వైరస్‌ కారణంగా 5,26,110 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,47,512 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్రం తెలిపింది.

మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.34శాతం ఉన్నాయని, రికవరీ రేటు 98.47శాతంగా ఉందని పేర్కొంది. రోజువారి పాజిటివిటీ రేటు 3.84శాతం ఉందని, విక్లీ పాజిటివిటీ రేటు 4.53శాతం ఉందని చెప్పింది. గత 24గంటల్లో 4,26,102 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు 87.37 కోట్ల టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది. మరో వైపు దేశంలో వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నది. టీకా డ్రైవ్‌లో 202.5కోట్ల డోసులు వేసినట్లు వివరించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/