మినీ డీఎస్సీ వద్దు.. మెగా డీఎస్సీ కావాలి..సీఎం నివాసం వద్ద ఏబీవీపీ కార్యకర్తలు నిరసనలు

ABVP workers protest at CM’s residence

అమరావతిః రాష్ట్రంలో మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు నేడు తాడేపల్లిలో సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించారు. మినీ డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ కావాలి అనే నినాదంతో వారు ‘ఛలో తాడేపల్లి’ పేరిట ఆందోళనకు దిగారు. నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని వారు మండిపడ్డారు. సీఎం నివాసం ముట్టడి సందర్భంగా విద్యార్థి నేతలు ఒక్కసారిగా దూసుకువచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడ్నించి మంగళగిరి పీఎస్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

పలువురు విద్యార్థి నేతలు పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నారు. దొరికిన వాళ్లను ఓ వాహనంలోకి ఎక్కించి అక్కడ్నించి తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ముట్టడిలో దాదాపు 100 మందికి పైగా విద్యార్థి నేతలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు విద్యార్థి నేతలకు గాయాలైనట్టు సమాచారం.