ఆల్కహాల్‌కు బదులుగా గంజాయి తాగాలని బిజెపి ఎమ్మెల్యే ఉచిత సలహా

ఆల్కహాల్‌ వల్లే దేశంలో అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయని ..అందుకే ఆల్కహాల్‌కు బదులుగా గంజాయి తాగాలని బిజెపి ఎమ్మెల్యే ఉచిత సలహా ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే క్రిష్ణమూర్తి బంధీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

గౌరేలా పెంద్రా మర్వాహి జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఈయన మాట్లాడుతూ.. ‘ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. గతంలో అసెంబ్లీలో కూడా దీనిపై చర్చించాను. ఆల్కహాల్‌ కారణంగా అత్యాచారం, హత్య, గొడవలు జరుగుతున్నాయని చెప్పాను. కానీ, ఎవరైనా భంగ్‌, గంజాయి తాగిన వారు ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా? అని అసెంబ్లీలోనే అడిగాను. వ్యసనాల అవసరాలను తీర్చేందుకు, లిక్కర్‌ నిషేధించేందుకు ఓ కమిటీని వేశారు. ప్రజలను భంగ్‌, గంజాయి వైపు ఎలా మళ్లించాలని ఆ కమిటీ ఆలోచించాలి. మత్తు కావాలనుకున్న వారికి అలాంటివే అందించాలి.’ అని చెప్పుకొచ్చాడు. ఈయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగింది. మత్తు పదార్థాలను ఓ ప్రజాప్రతినిధి ఎలా ప్రమోట్‌ చేస్తారు? అని ప్రశ్నించింది. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యల ఫై దేశ వ్యాప్తంగా చర్చ కు దారితీసింది.

బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది కాంగ్రెస్‌. మత్తు పదార్థాలను ఓ ప్రజాప్రతినిధి ఎలా ప్రమోట్‌ చేస్తారు? అని ప్రశ్నించింది. మరోవైపు.. ఈ విషయంపై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ను అడగగా.. మత్తు ఏ రూపంలో ఉన్నా ప్రమాదకరమేనని తెలిపారు. దేశంలో గంజాయి విక్రయాలను చట్టబద్ధం చేయాలనుకుంటే ఆయన కేంద్రాన్ని డిమాండ్‌ చేయాలన్నారు.