పల్నాడులో 144 సెక్షన్‌ అమలు

ఏపీలో ఎన్నికల పోలింగ్ సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా వైసీపీ – టిడిపి శ్రేణుల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. వైసీపీ నుండి టిడిపి లో చేరిన వారిపై దాడులకు తెగపడుతూ వస్తున్నారు. ముఖ్యంగా పల్నాడులో దాడులు ఎక్కువగా జరుగుతున్న క్రమంలో అక్కడ 144 సెక్షన్‌ అమలు చేసారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు జిల్లా మొత్తం 144 సెక్షన్‌ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో మాచర్ల, పెదకూరపాడు, నర్సరావుపేట, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఘర్షణలు జరగడంపై ఉన్నతాధికారులు స్పందించారు. కారంపూడి మండలం పేటసన్నిగండ్లలో మంగళవారం జరిగిన ఘర్షణల నేపథ్యంలో జిల్లా ఎస్‌పి బిందుమాధవ్‌ గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఆయన మాచర్లలోనే బస చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ముగ్గురికి మించి గుమికూడదని.. సభలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు సూచనలు చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.