తాడిపత్రిలో టీడీపీ-వైసీపీ మధ్య తీవ్ర ఘర్షణ

ఏపీలో టీడీపీ – వైసీపీ వర్గీయుల మధ్య దాడులు ఆగడం లేదు. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. మంగళవారం రాత్రి తాడిపత్రి పట్టణంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ వర్గీయుల రాళ్లతో దాడికి పాల్పడటంతో తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పార్టీ వర్గాల రాళ్ల దాడి, ఘర్షణలో సీఐ మురళీకృష్ణ తలకు గాయమైనట్లు తెలుస్తోంది.

తమ పార్టీ నేతపై దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి తన వర్గీయులతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తాడిపత్రి పట్టణంలో మంగళవారం నాడు హైటెన్షణ్ వాతావరణం కనిపించింది. పరిస్థితి అదుపు తప్పుతుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తాడిపత్రి పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. ఒక్క తాడిపత్రి లోనే కాదు రాష్ట్రంలోని చాల ప్రాంతాల్లో దాడులు ఎక్కువైపోతున్నాయి. దీంతో ప్రజలంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏంజరుగుతుందో అని ఖంగారుపడుతున్నారు.