బస్సును ఢీ కొట్టిన ట్రక్కు.. 11 మంది దుర్మరణం

మరో 15 మందికి తీవ్ర గాయాలు

11 die as truck rams into bus on Jaipur-Agra highway in Rajasthan

జైపూర్: రాజస్థాన్‌లో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై ఆగివున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. గుజరాత్ నుంచి మథురకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు హైవేపై బ్రేక్‌డౌన్ అయి నిలిచిపోయింది.

ఈ క్రమంలో వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ట్రక్ ఢీకొట్టడంతో బస్సులోని 11 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా, నిన్న ఇదే రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.