మంచిర్యాల జిల్లాలో భయానక సంఘటన ..

మంచిర్యాల జిల్లాలో భయానక సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వివాహితను వేధిస్తున్నాడని 25 ఏళ్ల యువకుడ్ని అతి దారుణంగా బండరాయితో కొట్టి చంపిన ఘటన జైపూర్ మండలం ఇందారం గ్రామంలో చోటుచేసుకుంది.

ఇందారం గ్రామానికి చెందిన ఓ వివాహితను మహేశ్ కొంతకాలంగా వేధిస్తున్నాడని, అదే ఈ హత్యకు దారితీసిందని తెల్సుకుతుంది. వివాహితకు మహేశ్ అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతున్నాడని, దీనిపై వివాహిత కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా మహేశ్ వేధింపులు ఆగకపోవడంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు ఈ దారుణానికి తెగబడినట్లు తెలుస్తోంది.

మంగళవారం ఉదయం బైక్ పై వెళుతున్న మహేశ్ పై వివాహిత కుటుంబ సభ్యులు దాడి చేశారు. కిందపడ్డ మహేశ్ ను బండరాయితో అతి దారుణంగా కొట్టి చంపారు. పదే పదే తలపై రాయితో మోదడంతో మహేశ్ అక్కడికక్కడే చనిపోయాడు. వీధిలో అందరూ చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది. ఈ భయానక సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రస్తుతం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మహేష్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు.