వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై పాల్వాయి స్రవంతి రియాక్షన్ ..

మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ గెలవదని , గెలవని పార్టీకి ప్రచారం ఎందుకు అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ ఫై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు ఎంతో బాధేస్తుందని మునుగోడు బరిలో నిల్చున్న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. ప్రస్తుతం వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో బిజీ గా ఉన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఆస్ట్రేలియా కు వెళ్లిన ఆయనకు అభిమానులు స్వాగతం పలికారు. అక్కడ ఎయిర్‌ పోర్టులో కాంగ్రెస్‌ పార్టీ అభిమానులతో ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తాను మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసినా.. కాంగ్రెస్‌ గెలవదన్నారు.

తాను ప్రచారం చేస్తే.. ఓ 10 ఓట్లు పెరుగుతాయి తప్ప… కాంగ్రెస్‌ పార్టీ మాత్రం అస్సలు గెలవదని కుండ బద్దలు కొట్టారు. ఇక నేనే ప్రచారానికి వెళ్లి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ఎంపీగా మరియు ఎమ్మెల్యే గా 25 ఏళ్లు గా కాంగ్రెస్‌ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నానని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఇక నిన్నటికి నిన్న తన తమ్ముడికి ఓటు వేయాలని కోమటిరెడ్డి తెలిపిన ఆడియో ఒకొట్టి లీక్ అయినా సంగతి తెలిసిందే. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూ..ఆ పార్టీకి నమ్మక ద్రోహం చేయడం పట్ల కార్య కర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ ఫై స్రవంతి మీడియా తో స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అన్నలా భావించానని, అండగా ఉంటారు అనుకున్నాను కానీ వెంకట్ రెడ్డి మాటలు చాలా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండానే ఎగురుతోందన్నారు. నాకు ధన బలం లేకపోవచ్చు కానీ.. ప్రజాబలం ఉందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు స్రవంతి.