మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం..10 మంది మృతి

Road accident in maharashtra
Road accident in maharashtra

మహారాష్ట్ర: మహారాష్ట్రలోని జలగావ్‌ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. యావల్‌ తాలుకాలోని హింగోలా గ్రామ సమీపంలో ఓ వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. కాగా మహారాష్ట్రలో వారం రోజుల వ్యవధిలోనే ఇది రెండవ ప్రమాదం.

తాజా బడ్జెట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/budget/