కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం

ఐదుగురు మంత్రులతో కేంద్రం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

Kishan Reddy
Kishan Reddy

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి దేశంలో మూడు కరోనా వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో స్పందించారు. కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతు.. ఐదు మంత్రిత్వ శాఖల మంత్రులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వైద్యశాఖ మంత్రి హర్షవర్థన్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ పనిచేస్తుందని వివరించారు. రాష్ట్రాలకు కరోనా వైరస్ నిర్ధారణ కిట్లు, వైద్య బృందాల తరలింపుపై కమిటీ చర్చిస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని, కరోనా వైరస్ సోకిన బాధితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తామని చెప్పారు. కేరళ, ఇతర రాష్ట్రాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, చైనా నుంచి విద్యార్థులను, ఇంజినీర్లను తీసుకువచ్చి పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/