ఉగ్రవాదుల ఏరివేత .. టెర్రరిస్టు హతం

1-terrorist-killed-in-encounter-in-jammu-kashmirs-anantnag

శ్రీనగర్ః జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతున్నది. అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కొకెర్‌నాగ్‌ ప్రాంతంలోని తంగ్‌పవా వద్ద ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ఆదివారం రాత్రి గాలింపు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ టెర్రరిస్టు చనిపోయాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నదని వెల్లడించారు. మృతిచెందిన ముష్కరుడు ఏ ఉగ్రసంస్థకు చెందినవాడనేది ఇంకా గుర్తించాల్సి ఉన్నదని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/