గుడివాడలో BRS పార్టీ ఫ్లెక్సీలు..

జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రకటించిన BRS పార్టీ ఫై దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే పలు పార్టీలు BRS లో విలీనం చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. అలాగే పలు పార్టీల నేతలు సైతం BRS లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఏపీలోను BRS హడావిడి కనిపిస్తూనే ఉంది. కేసీఆర్ పార్టీ ప్రకటన రోజు విజయవాడ లో మద్దతు పలుకుతూ ప్లెక్సీ లు వెలువగా..తాజాగా గుడివాడలోని బీఆర్ఎస్ కు మద్దతుగా ప్లెక్సీ లు వెలువడం ఇప్పుడు చర్చ కు దారితీసింది.

‘కేటీఆర్ యూత్’ పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గుడివాడ పట్టణంలోని ప్రధాన సెంటర్ల వద్ద వీటిని ఏర్పాటు చేశారు. ‘TRS to BRS భారతదేశంలో రాజకీయ సునామి సృష్టించేందుకు జాతీయ పార్టీని ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇవే మా శుభాకాంక్షలు’ అంటూ ఆ ఫ్లెక్సీల ద్వారా అభినందనలు తెలిపారు. మాజీ మంత్రి కొడాలి నాని ఏపీలో కేసీఆర్ పార్టీకి పెద్దగా ప్రజాదరణ ఉండదు అని వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే గుడివాడలో ఇలా ఫ్లెక్సీలు కనిపించడం మరింత చర్చ గా మారింది. ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది వెలమ సామాజిక వర్గానికి చెందిన వారేనని.. కేసీఆర్‌పై అభిమానంతో వీటిని ఏర్పాటు చేశారని అంటున్నారు.