గ్లామర్ డోస్ పెంచిన కీర్తి సురేష్

నేను శైలజ మూవీ తో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన కీర్తి సురేష్..మొదటి సినిమాతోనే చక్కటి విజయం అందుకొని యూత్ కు దగ్గరైంది. ఆ తర్వాత నేను లోకల్ , మహానటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అవ్వడమే కాదు ఎన్నో అవార్డ్స్ అందుకుంది. కానీ ఆ తర్వాత వరుస ఛాన్సులు వచ్చినప్పటికీ పెద్దగా విజయాలు అందుకోలేకపోయింది. రీసెంట్ గా మహేష్ బాబు సరసన సర్కార్ వారి పాట చిత్రంతో అసలైన హిట్ అందుకుంది. ఈ సినిమాలో తనలోని అసలైన గ్లామర్ ను బయటకు తీసి అందరికి షాక్ ఇచ్చింది.

మొదటి నుండి కూడా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండడంతో ఈమె వెనుక వచ్చిన హీరోయిన్లంతా వరుస ఛాన్సులతో టాప్ ప్లేస్ కు చేరుకున్నారు. కానీ కీర్తి మాత్రం అక్కడే ఉండి పోయింది. దీంతో ఇలాగైతే కుదరదని నిర్ణయం తీసుకున్న కీర్తి.. గ్లామర్ డోస్ పెంచేసింది. సర్కార్ వారి పాట ముందు వరకు కూడా పెద్దగా అందాల ఆరబోత చేయని కీర్తి..సర్కార్ వారి పాట చిత్రంలో భారీగా అందాల ఆరబోత చేసి అందర్నీ షాక్ కు గురి చేసింది. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను భారీగా అందాల ఆరబోత చేస్తూ యూత్ ను , ఫ్యాన్స్ ను కట్టిపడేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నాయి. ఈ పిక్స్ చూసిన సినీ జనాలు కీర్తి కి వరుస ఛాన్సులు రావడం పక్క అంటూ మాట్లాడుకుంటున్నారు.