కర్ణాటకలో మాస్కులు తప్పనిసరి..ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

బెంగళూరు : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్లు, విద్యా సంస్థలు, బార్లు, రెస్టారెంట్లలో మాస్కులు ధరించిన వారికే అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. కొత్త ఏడాది వేడుకల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. జాగ్రత్త ఉండాలని, ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. కొవిడ్ అదుపులోనే ఉందని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
అంతేకాక న్యూ ఇయర్ వేడుకలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే నిర్వహించుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత వేడుకలను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యూఇయర్ వేడుకల వేళ.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ స్పష్టం చేశారు. గర్భిణులు, పిల్లలు, వృద్ధులు.. బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని సూచించారు. పరిమితికి మించి జనాలను ఇండోర్ ఈవెంట్స్‌కు అనుమతించొద్దన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/