నందిగ్రామ్ నుంచి నామినేష‌న్ దాఖ‌లు చేసిన మ‌మ‌తా

కోల్‌క‌తా: అసెంబ్లీ ఎన్నిల‌క కోసం నందిగ్రామ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ బుధ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. నందిగ్రామ్‌లో రెండు కిలోమీట‌ర్ల పాటు రోడ్ షో నిర్వ‌హించిన త‌ర్వాత ఆమె హ‌ల్దియా స‌బ్‌-డివిజిన‌ల్ కార్యాల‌యంలో నామినేష‌న్ వేశారు. ఆమె వెంట పార్టీ అధ్య‌క్షుడు సుబ్ర‌తా భ‌క్షి ఉన్నారు. నామినేష‌న్ వేసే ముందు మ‌మ‌తా స్థానిక శివాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు .

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/