పేపర్ లీకేజ్ వ్యవహారం ..ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు

కార్యకర్తలను అరెస్ట్ చేసి గోషామహల్ పీఎస్ కు తరలించిన పోలీసులు

abvp-workers-tried-to-attack-pragathi-bhavan

హైదరాబాద్‌ః టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణలో కలకలం రేపింది. దీని వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ లీకేజీపై ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు.

ఈ సందర్భంగా ప్రగతి భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.