ఢిల్లీలో బాణాసంచాపై సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం

'Supreme' notices to CSs of AP and Bihar states
supreme-court

ఢిల్లీలో బాణాసంచాపై సుప్రీం కోర్ట్ కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ లో బాణాసంచాపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఢిల్లీ లో బాణాసంచాపై నిషేధాన్ని ఎత్తివేయబోమని, తమ ఉత్తర్వు చాలా స్పష్టంగా ఉందని కోర్టు తెలిపింది. పండుగ సీజన్లలో పటాకుల అమ్మకాలు, కొనుగోలు, వినియోగంపై నిషేధాన్ని సవాలు చేస్తూ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఢిల్లీ రాజధాని ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలపై ఆందోళన వ్యక్తం చేసింది.

దీనిపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలో బాణసంచా నిషేధానికి సంబంధించిన ఉత్తర్వు చాలా స్పష్టంగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. దీపావళి తర్వాత ఢిల్లీ ఎన్‌సిఆర్‌ సెక్టార్ లో గాలి నాణ్యత మరింత క్షీణిస్తుందని, పరిస్థితులు మరింత దారుణంగా మారుతామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గ్రీన్ క్రాకర్స్ వాడకాన్ని కూడా పరిమితం చేయాలని బెంచ్ పేర్కొంది. దీపావళి, ఛత్ పూజ, గురునానక్ జయంతి, నూతన సంవత్సరానికి ఢిల్లీలో పటాకుల నిషేధం కొనసాగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.