రాజ్ భవన్ ఎట్ హోం విందుకు హాజరైన రాజకీయ ప్రముఖులు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదటిసారి హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఈ సందర్బంగా రాష్ట్రపతికి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ రాజ్ భవన్ లో ‘ఎట్ హోం’ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు గవర్నర్ తమిళిసైతోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. గవర్నర్ ఇచ్చిన విందుకు పార్టీలకు అతీతంగా హాజరైన నేతలు సరదాగా మాట్లాడుకున్నారు. కాగా ఈ విందులో ఆసక్తికర సన్నివేశం జరిగింది. బీఆర్ఎస్ మంత్రులు నిరంజన్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డిలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆప్యాయంగా నవ్వుతూ పలకరించారు. వీరి ముగ్గురు ఒకరినొకరు నవ్వులు చిందిస్తూ పలకరించుకున్నారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డిలు కూర్చున్న టేబుల్ దగ్గరకు వెళ్లి మరి రేవంత్ రెడ్డి పకలరించారు. నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు కూడా రేవంత్ రెడ్డికి మర్యాద ఇచ్చారు. రేవంత్ రావడంతో కుర్చీలో నుంచి లేచి మరి అప్యాయంగా పలకరించారు.