మలి వయసుకు మేలు చేసే ఆహారం

మహిళలు యాభై దాటాక ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మలి దశలో మహిళలకు గుండె సమస్యలు రావడం మామూలే. వాటి ప్రభావం తగ్గించుకోవాలంటే ఆహారంలో అవిసెగింజలు ఉండాలి. వీటిల్లోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చాలా మంది మహిళలు పాలు తాగరు కానీ వాళ్లకు అవసనం.
లాక్టోజ్ సమస్య ఉన్నవారు బాదం లేదా సోయా పాలు ఎంచుకోవచ్చు. వయసు పెరిగేకొద్దీ రోగనిరోధక వ్యవస్థ బాగుండాలంటే గుడ్లు ఆహారంలో భాగం కావాలి. ఇవి బి 12 విటమిన్ ని అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఒకవేళ కొలెస్ట్రాల్ సమస్య ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. పచ్చసొన తినాలా వద్దా అనేది వైద్యులే చెపుతారు.
శరీరానికి యాంటి ఆక్సిడెంట్లు లభించాలంటే అల్పాహారంలో ఓట్స్ తీసుకుని చూడండి. కుదిరితే వాటికి ఇతర పండ్లు డ్రైఫ్రూట్స్ కలిపి తీసుకుంటే అవసరమైన పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. బరువూ అదుపులో ఉంటుంది.
ఎముకలు గుల్లబారడం మలిదశలో ఎదురయ్యే సమస్యల్లో ఒకటి. దీన్నుంచి బయటపడాలంటే పెరుగు రోజువారి ఆహారంలో ఉండాలి. రోజుకో కప్పు పెరుగు తీసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి.