వైరల్‌ వ్యాధులు-2

ఆరోగ్య భాగ్యం

Viral Diseases
Viral Diseases

జీర్ణకోశ వైరల్‌ డిసీజెస్‌:

వైరల్‌ ఫుడ్‌ పాయిజనింగ్‌ ఎ) హైపటైటిస్‌ ఎ వైరస్‌ : కామెర్లు, శరీరం పసుపువర్ణంలో ఉండడం, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలుంటాయి.

15% మందిలో తరుచుగా రావచ్చు. బి) నోరో వైరస్‌: ఇది అంటువ్యాధిగా యుఎస్‌లో 20 మిలియన్స్‌ మంది ఎఫెక్ట అయినారు. సి) రోటావైరస్‌: పిల్లల్లో ఎక్కువగా కన్పిస్తుంది డి) ఎడినోవైరస్‌ ఇ) ఆస్ట్రోవైరస్‌ ఇన్ఫెక్షన్స్‌.

జీర్ణకోశ ఇన్ఫెక్షన్స్‌తో బాదపడేవారు తాకడం, అపరిశభ్రమైన చేతులు, షవర్స్‌, స్విమ్మింగ్‌ఫూల్స్‌, రోగి స్రావాలు, వస్తువులు, టవల్స్‌ వాడడం వల్ల వ్యాపిస్తాయి. వీటినే స్టమక్‌ ఫ్లూ, స్టమక్‌ వైరస్‌ అని అంటారు.

ఎగ్జాధిమాటస్‌ (చర్మ సంబంధమైన) వైరల్‌ డిసీజెస్‌ :

మొలస్కామ్‌ కాంటాజియెసమ్‌: 1-10 సంవత్సరాల పిల్లల్లో చిన్న పొక్కులు గుంపుగా వచ్చి 6-12 నెలల్లో తగ్గుతాయి.

హెర్పిస్‌ సింప్లెక్స్‌ హెచ్‌ఎస్‌యు: జెనిటల్‌ హెర్పిస్‌ వల్ల యుఎస్‌లో 85% కొల్డ్‌ సోర్స్‌, కలుషిత ఆహారం, నీరు, లాలాజలం, తాకడం, కిస్సింగ్‌ వల్ల వ్యాపిస్తాయి.

వెరిసెల్లా జోష్టర్‌ వైరస్‌ (వి2వి): దీని వల్ల దురదతో కూడిన నీటి పొక్కులు, నీరసం, జ్వరం, వళ్లు నొప్పులు వంటి లక్షణాలుంటాయి. ఇవేగాక చికెన్‌గున్యా, స్మాల్‌పాక్స్‌, వీజిల్స్‌ ఇన్ఫెక్షన్స్‌ వస్తాయి.

పులిపిర్లు : జెనిటల్‌వార్ట్స్‌, ఇవి తాకడం, రోగి టవల్స్‌, వస్తువుల వల్ల వ్యాపించే అంటువ్యాధులు, వీటినే క్యుటేనియస్‌ వైరల్‌ డిసీజెస్‌ అని అంటారు.

హెపాటిక్‌ వైరల్‌ డిసీజెస్‌:

వీటినే సెక్యువల్‌ ట్రాన్స్‌మిటేడ్‌ వైరల్‌ డిజీజెస్‌ అని అంటారు. ఇవి రక్తం,

స్రావాలు, రేజిర్స్‌, బ్లేడ్స్‌వల్ల, సెక్యువల్‌ కాంటాక్ట్‌ ద్వారా, రోగి మలమూత్రాం, కలుషిత ఆహారం నీరు ద్వారా వ్యాపిస్తాయి.

హెపటైటిస్‌ ఎ,బి,సి,డి,ఇ వల్ల కాలేయ వాపు వల్ల కామెర్లు వస్తాయి. బి) హ్యుమన్‌ పాపిల్లోమా వైరస్‌ (హెచ్‌పివి): దీనివల్ల పులిపిర్లు, సర్వైకల్‌ కేన్సర్‌ వస్తుంది.

యుఎస్‌లో ఇది సర్వసాధారణమైన ఇన్ఫెక్షన్‌. సి) జెనిటల్‌ హెర్పిస్‌ హెచ్‌ఎస్‌వి2

హెచ్‌ఐవి వైరస్‌.హెమరేజిక్‌ వైరల్‌ డిసీజెస్‌: ఇవి టిక్స్‌, దోమలు వంటి క్రీమి కీటకాలు, రక్తం, రోగి స్రావాలు, ఎలుకల మలమూత్రాల వల్ల సర్కులేటరీ సిస్టమ్‌ దెబ్బతిని అంతర్గత రక్తస్రావాలు కన్పిస్తాయి.

చర్మం, నోరు, చెవులు, ఇంటర్నల్‌ అవయవాలు.

ఉదా: ఎబోలా, లాసా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్‌, మర్బార్‌హెమరేజి ఫీవర్‌, క్రిమియన్‌ కాంగో హెమరేజిక్‌ ఫవర్‌,

న్యురాలాజికల్‌ వైరల్‌ డిసీజెస్‌ : ఇవి దోమలు, టిక్స్‌ రోగులకి సన్నిహితంగాఉంఏవారికి వ్యాధిగ్రస్తమైన జంతువుల ద్వారా మెదడు, నరాల వ్యాధులు వస్తాయి.

ఉదా: పోలియో, వైరల్‌ మెనింజైటిస్‌, ఎన్‌సెఫలైటిన్‌ వీరు జర్వం, కన్‌ప్యూజిన్‌, మగత, ఫిట్స్‌, సృహతప్పడం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు.

కొన్ని వైరస్‌లు జంతుల్లో రిజర్వాయర్స్‌గా ఉండి వ్యాపిస్తాయి.

ఉదా: ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌- పక్షులు, పందులు, గుర్రాలు, లేబిస్‌ వైరస్‌ – గబ్బిలాలు, కుక్కలు, నక్కలు లాసా/హంటావైరస్‌ – ఎలుకలు

ఎబోలా/ మార్బార్గ్‌ వైరస్‌ – కోతులు హెచ్‌ఐవి, 2 వైరస్‌ – చింపాజీలు, కోతులు వెస్ట్‌ నెయిల్‌ వైరస్‌ – పక్షులు

డాక్టర్‌. కె.ఉమాదేవి, తిరుపతి

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/