ఆ పార్టీలో ఉంటూ ప్రజాసేవ చేయలేము

గతంలోని కాంగ్రెస్ కు ఇప్పటి కాంగ్రెస్ కు తేడా ఉంది

Jyotiraditya-Scindia
Jyotiraditya-Scindia

న్యూఢిల్లీ: జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే సింధియా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సింధియా మాట్లాడుతూ, ప్రధాని మోడి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలియజేశారు. బిజెపి కుటుంబంలోకి తనను ఆహ్వానించి, స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. నా జీవితంలో రెండు మర్చిపోలేని ఘటనలు ఉన్నాయని… అందులో ఒకటి తన తండ్రి మరణమని, మరొకటి కొత్త దారిలో పయనించాలని నిన్న తాను నిర్ణయం తీసుకోవడమని చెప్పారు. గతంలోని కాంగ్రెస్ కు, ఇప్పటి కాంగ్రెస్ కు చాలా తేడా ఉందని సింధియా అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎప్పటికీ సాధించలేమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గతి తప్పిందని… గతంలో మాదిరి ఇప్పుడు లేదని అన్నారు.

తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/